Header Banner

ప్రజా సమస్యల కోసం కాదు.. హాజరు మార్క్ కోసం అసెంబ్లీలోకి? జగన్‌పై బీజేపీ నేత ఘాటు వ్యాఖ్యలు!

  Tue Feb 25, 2025 16:19        Politics

ఏపీ అసెంబ్లీలో(AP Assembly Session) గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభకు వచ్చి కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉండి ఆపై వెళ్లిపోవడంపై కూడా అధికారపక్షం మండిపడుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి (MP Daggubati Purandeswari) స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు పురంధేశ్వరి చురకలంటించారు. ఆరు నెలలు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందని.. అందుకే జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్లి అటెండెన్స్ వేయించుకుని వచ్చారని అన్నారు. కానీ ప్రజలిచ్చిన బాధ్యతను జగన్ మర్చిపోవడం సరికాదన్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను లేవనెత్తాలని తెలిపారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చిన విషయం ఆంధ్ర ప్రజలందరికీ తెలుసన్నారు.


ఇది కూడా చదవండి: భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..


అసెంబ్లీలో ప్రజా సమస్యలు కోసం జగన్ మాట్లాడకపోవటం, హాజరు కోసం వెళ్ళటం సిగ్గుచేటు అంటూ ఎంపీ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఇంకా మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు. మహిళలు, యువత, పెట్టుబడులు, వ్యవసాయ రంగాలకు బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో దేశంలో మూడు కోట్ల ఇళ్ళు పేదలకు నిర్మిస్తామని వెల్లడించారు. డ్రోన్ల ద్వారా మహిళలు వ్యవసాయం చేసే కార్యక్రమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించామన్నారు. విశాఖ, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి రైల్వే స్టేషన్ల అబివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనాలను ప్రారంభించి.. ఆసుపత్రులో శస్త్ర చికిత్సలు జరిగేలా కృషి చేస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #purndeswari #bgpleader #todaynews #assembly #meeting #fashnews #latestupdate